డెహ్రాడూన్లో దారుణం: ఇంట్లోకి చొరబడి వృద్ధ దంపతులతో సహా ముగ్గురి హత్య

రిపోర్టర్: రమేష్ స్థలం: డెహ్రాడూన్

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ నగరంలో తీవ్ర కలకలం రేపిన ఘటనలో వృద్ధ దంపతులతో పాటు వారి ఇంట్లో పనిచేసే మహిళను ప్లంబర్ అత్యంత క్రూరంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. విశుక్ లోక్ కాలనీలో జరిగిన ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. డబ్బుల విషయంలో జరిగిన వివాదమే ఈ త్రివిధ హత్యలకు ప్రధాన కారణమని ఎస్పీ ప్రమేంద్ర దోభాల్ స్పష్టం చేశారు.