మార్చి నాటికి రాష్ట్రంలో భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం: సీఎం చంద్రబాబు
రిపోర్టర్: రాజేష్
స్థలం: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా
రాష్ట్రంలో వచ్చే మార్చి నాటికి అన్ని భూ సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కోనసీమ జిల్లా మాచవరంలో జరిగిన మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశామని, భూములకు పూర్తి భద్రత కల్పిస్తూ అత్యుత్తమ టెక్నాలజీతో పాస్‌పుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు. గత పాలనలో భూములకు భద్రత లేకుండా పోయిందని మండిపడ్డారు.