అప్పలనరసింహాపురం విషాదం: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతితో మూడుకు చేరిన మృతుల సంఖ్య

రిపోర్టర్: హరి స్థలం: ఖమ్మం

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అప్పలనరసింహాపురం గ్రామంలో అప్పుల బాధతో తండ్రి తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మూడుకి చేరింది. గత నెల పదహారవ తేదీన తండ్రి శ్రీనివాసరావు తన కూతురు లాస్య, కుమారుడు నిఖిల్కు శీతల పానీయంలో గడ్డిమందు కలిపి తాపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో తండ్రి, కూతురు అప్పుడే మృతిచెందగా, తీవ్ర ఆనారోగ్యంతో పద్దెనిమిది రోజులుగా చికిత్స పొందుతున్న నిఖిల్ పరిస్థితి విషమించడంతో ఆదివారం కన్నుమూశాడు అని కుటుంబ సభ్యులు వెల్లడించారు.