వరద ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ ఎమ్మెల్యే ఎస్పీ క్షేత్రస్థాయి పర్యటన

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాసలో భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాలను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, ఎస్పీ పరిశీలించారు. సహాయక బృందాలతో కలిసి పర్యటించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. నదులు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.