'హరీష్ రావు చేతిని తొక్కి అమానుషంగా ప్రవర్తించారు': కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: రమేష్ స్థలం: Hyderabad

అసెంబ్లీ వద్ద జరిగిన ఉద్రిక్తతలో కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది. పోలీసులతో జరిగిన తోపులాటలో హరీష్ రావు కిందపడగా, ఆయన చేతిని తొక్కి పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ప్రజా సమస్యలపై నిలదీస్తుంటే పోలీసులను అడ్డంపెట్టి దమనకాండకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.