రానున్న ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యమంటూ మంత్రి ఆనగాని సత్యప్రసాద్ పిలుపు
రిపోర్టర్: సునీల్
స్థలం: బాపట్ల
రానున్న ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా నాయకులు మరియు కార్యకర్తలంతా సమష్టిగా పనిచేయాలని ఆనగాని సత్య ప్రసాద్ - రెవెన్యూ శాఖ మంత్రి, రేపల్లె ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమం మరియు అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి చారిత్రాత్మక విజయం సాధిద్దామని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు సైనికులా కష్టపడి పనిచేసి రాబోయే రోజుల్లో పార్టీని మరింత పటిష్టం చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.