కామ్రేడ్ ముఖ్తార్ పాష వర్ధంతి సందర్భంగా ఆలేరులో ఘన నివాళి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఆలేరు

ఆలేరులో సీపీఐ ఎంఎఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో కామ్రేడ్ ఎస్.కే.ముఖ్తార్ పాష, పైలా చంద్రక్కల ఆరవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్మిక వర్గ విముక్తి కోసం వారు చేసిన పోరాటాలను, వారి ఆశయాలను ఈ సభలో జిల్లా కార్యదర్శి ఆర్.జనార్ధన్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.