నెల్లూరు సంగం కాలువలో పడి ఇద్దరు యువకులు గల్లంతు
రిపోర్టర్: రాజేష్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా సంగం బెజవాడ కాశీరెడ్డి కాలువలో గుంటూరుకు చెందిన మోహన్, ఇబ్రహీం ప్రమాదవశాత్తు పడి గల్లంతయ్యారు. లైటింగ్ పనుల కోసం వచ్చిన వీరు కాలువలో పడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే స్పందించి ఇబ్రహీంను సురక్షితంగా రక్షించగా, మోహన్ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.