గుడ్ న్యూస్: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ నటి మైరా మిశ్రా
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
భాగ్య లక్ష్మి సీరియల్ నటి మైరా మిశ్రా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దిల్లీకి చెందిన రాహుల్ యాదవ్ ను ఫిబ్రవరి 2025 లో వివాహం చేసుకున్న ఈ దంపతులు, తమ మొదటి సంతానాన్ని స్వాగతించినట్లు తెలిపారు. నవజాత శిశువు పాదాల ఫోటోను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ శుభవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, సహ నటులు దంపతులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.