హరాక్ సింగ్ రావత్ పై తీవ్ర ఆరోపణలు: డీఎన్ఏ పరీక్ష కోరిన ఇందిరా దేవి
రిపోర్టర్: మహేష్
స్థలం: Dehradun
కాంగ్రెస్ సీనియర్ నేత హరాక్ సింగ్ రావత్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ అస్సాం వాసి ఇందిరా దేవి అలియాస్ జెన్నీ కొత్త డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. తన కుమారుడికి తండ్రి పేరు దక్కేలా చూడాలని, తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని ఆమె కోరారు. గతంలో సీబీఐ విచారణ జరిగి ఆయనకు క్లీన్ చిట్ లభించినప్పటికీ, ఈ పాత వివాదం ఇప్పుడు మళ్లీ తెరపైకి రావడం తీవ్ర కలకలం రేపింది.