నేరాల దర్యాప్తునకు 26 మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్లు ఏర్పాటు
రిపోర్టర్: సతీష్
స్థలం: అమరావతి
నేర పరిశోధనను వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎలాంటి సంఘటన జరిగినా క్షణాల్లో ఆధారాలు సేకరించేందుకు 26 మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్లను అందుబాటులోకి తెచ్చింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, డేటా కిట్లతో కూడిన ఈ వాహనాలు సైబర్ నేరాలు, లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఏపీ ఫోరెన్సిక్ అధికారులు స్పష్టం చేశారు.