'30 తులాల బంగారం స్వాధీనం': కర్నూలులో లేడీ దొంగ అరెస్ట్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: కర్నూలు

కర్నూలు జిల్లా మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని మహిళల హ్యాండ్ బ్యాగుల నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న వాణి అనే నిందితురాలిని కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించిన వివరాల ప్రకారం, నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం సిద్దాపురం గ్రామానికి చెందిన నిందితురాలి వద్ద నుంచి సుమారు 30 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని, త్రీ టౌన్, ఫోర్త్ టౌన్, మంత్రాలయం, పాణ్యం పోలీస్ స్టేషన్ల పరిధిలోని నాలుగు కేసులను ఛేదించి ఆమెను రిమాండ్‌కు తరలించారు.