సన్న ధాన్యానికి భారీ డిమాండ్‌తో పొలాల వద్దే కొనుగోళ్లు

రిపోర్టర్: నరేష్ స్థలం: నిజామాబాద్

తెలంగాణలో సన్న ధాన్యానికి ఒక్కసారిగా భారీ డిమాండ్ ఏర్పడింది. వరి కోతలు ప్రారంభం కాకముందే వ్యాపారులు పొలాల వద్దకు వచ్చి క్వింటాలుకు గరిష్టంగా రూ.2,950 వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో బీపీటీ రకం ధాన్యానికి ఈ ధర లభిస్తుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాల నిబంధనల నుంచి ఊరట లభించడంతో పాటు రైతులకు ఎండబెట్టే శ్రమ తప్పుతోందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.