హైదరాబాద్ లో అత్యాధునిక నెట్ జీరో పబ్లిక్ టాయిలెట్ ప్రారంభం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Hyderabad
హైదరాబాద్ నగరంలోని లుంబిని పార్క్ లో బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రూపొందించిన తొలి రీఫ్ లో వాటర్ రీసైక్లింగ్ పబ్లిక్ టాయిలెట్ ను మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మరియు పొన్నం ప్రభాకర్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. కోటి రూపాయల వ్యయంతో సోలార్ శక్తితో పనిచేసే ఈ సరికొత్త గ్రీన్ టాయిలెట్ వ్యవస్థ మురుగునీటి అవసరం లేకుండా వ్యర్థాలను అక్కడికక్కడే శుద్ధి చేసి నీటిని మళ్లీ వినియోగించుకునేలా ప్రత్యేకంగా రూపొందించబడిందని వారు వెల్లడించారు.