ఎన్నికల ప్రశాంతత కోసం అందరూ సహకరించాలని విజయవాడ పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి
రిపోర్టర్: నరేష్
స్థలం: ఎన్టీఆర్
ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి శాంతి సామరస్యాలను కాపాడాలని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు విజ్ఞప్తి చేశారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యయుత వాతావరణంలో ఎన్నికలు సజావుగా ముగిసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.