ముంబై: జయ బచ్చన్ పిలుపుపై అమితాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ముంబై
అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్పతి షోలో రణ్బీర్ కపూర్ తో ముచ్చటించారు. తన వివాహ ప్రారంభ రోజుల్ లో భార్య జయ బచ్చన్ తనను లంబు జీ అని పిలిచేవారని అమితాబ్ తెలిపారు. అయితే తన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ సూచన మేరకే ఆమె తనను పేరు పెట్టి పిలవడం ప్రారంభించారని ఈ సందర్భంగా లెజెండరీ నటుడు గుర్తుచేసుకున్నారు. కుటుంబంలోని ఎత్తుల తేడాలపై జరిగిన సరదా సంభాషణలో ఈ విషయాలను అమితాబ్ బచ్చన్ పంచుకున్నారు.