తిరుమలలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు

రిపోర్టర్: కృష్ణ స్థలం: తిరుపతి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వేద మంత్రాల మధ్య సీఎంకు పరివట్టం కట్టి పట్టువస్త్రాలను తలపై ఉంచారు అర్చకులు. అనంతరం సంప్రదాయ వస్త్రధారణతో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి తదితరులు పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు.