తిరుమల భక్తులకు తీపి కబురు: గరుడ మ్యాప్ యాప్ రూపకల్పన చేసిన టీటీడీ
రిపోర్టర్: రమేష్
స్థలం: Tirumala
తిరుమలకు వచ్చే భక్తులు ఇతరుల సహాయం లేకుండా తాము వెళ్లవలసిన ప్రాంతానికి సులువుగా చేరుకునేలా టీటీడీ గరుడ మ్యాప్ యాప్ను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో పనిచేసే ఈ యాప్ ద్వారా కల్యాణకట్ట, క్యూ కాంప్లెక్సులు, లడ్డూ కేంద్రాలు, వసతి గృహాల మార్గాలను వాయిస్ కమాండ్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో ఈ సరికొత్త యాప్ భక్తులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని వెల్లడించారు.