ట్రెండింగ్ లో జాన్వీ కపూర్: అచ్చం శ్రీదేవి నాగిని గెటప్ లో మెరుపు
రిపోర్టర్: హరి
స్థలం: ముంబై
దివంగత లెజెండరీ నటి శ్రీదేవి జ్ఞాపకాలను బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ మరోసారి గుర్తుచేశారు. తాజాగా జరిగిన హలోవీన్ వేడుకల్ లో శ్రీదేవి కెరీర్ లోని మోస్ట్ ఐకానిక్ మూవీ నాగిని చిత్రంలోని గెటప్‌ను అచ్చుగుద్దినట్లు దింపి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు జాన్వీ కపూర్ తన స్నేహితులతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అచ్చం తన తల్లే యువరాణిలా ఉందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నట్లు ఫిల్మ్‌ఫేర్ పేర్కొంది.