నెగిటివ్ ప్రచారంపై ఘాటుగా స్పందించిన హీరో నాని

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన ప్యారడైజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో నాని తనపై, సినిమాపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. గెలవాలని కోరుకునేవారితో పాటు మనం ఓడిపోతే చూడాలనుకునే వారు కూడా ఉంటారని, మనల్ని ఎవరూ ఆపలేరంటూ పవన్ కల్యాణ్ డైలాగ్ ను గుర్తు చేస్తూ నాని గట్టి కౌంటర్ ఇచ్చారు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో తన అనుబంధాన్ని, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబుల పాత్రల ప్రాధాన్యతను ఆయన ఈ వేదికగా వివరించారు.