ఛత్ పూజ కోసం ఢిల్లీ నుంచి బీహార్ కు ఆటోలో యువకుడి ప్రయాణం

రిపోర్టర్: నరేష్ స్థలం: Delhi

రైలు టికెట్లు దొరకకపోవడంతో రిషవ్ ఠాకూర్ అనే యువకుడు ఢిల్లీ నుంచి బీహార్ లోని మధుబని వరకు ఆటోలో సాహసయాత్ర చేపట్టారు. గత మూడేళ్లుగా పండుగకు ఇంటికి వెళ్లలేకపోయామని, ఎలాగైనా స్వగ్రామం చేరుకోవాలనే పట్టుదలతో ఈ ప్రయాణం ప్రారంభించామని ఆయన తెలిపారు. కాన్పూర్, లక్నో మీదుగా సాగుతున్న ఈ ప్రయాణంలో ఇంటి నుంచి తెచ్చుకున్న రొట్లు తింటూ వారు ముందుకు సాగుతున్నారు. ఛత్ పూజపై వారికున్న భక్తి నెట్టింట వైరల్ అయింది.