మున్సిపల్ ఎన్నికలు: నేడు నగరపాలక సంస్థల మేయర్ స్థానాల రిజర్వేషన్ల జాబితా విడుదల
రిపోర్టర్: శివ
స్థలం: అమరావతి
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రాథమిక కసరత్తు పూర్తయిందని, సోమవారం నగరపాలక సంస్థల వారీగా రిజర్వేషన్ల జాబితా విడుదల చేయనున్నట్లు పురపాలక శాఖ అధికారులు వెల్లడించారు. మంగళగిరి-తాడేపల్లి మేయర్ పదవిని ఎస్టీలకు, రాజమహేంద్రవరం, కర్నూలు స్థానాలను ఎస్సీలకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు, జనాభా నిష్పత్తి ఆధారంగా ఈ జాబితాను రూపొందించామని, మొత్తం 17 కార్పొరేషన్లు, 106 పురపాలక సంఘాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లతో పాటు మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.