జైపూర్లో దారుణం: దుండగలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వర్తకులకు తీవ్ర గాయాలు

రిపోర్టర్: నరేష్ స్థలం: Jaipur

జైపూర్లోని జామ్డోలి ప్రాంతంలో షాపు మూసివేసి ఇంటికి వెళ్తున్న ఇద్దరు నగల వ్యాపారి సోదరులపై దుండగలు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. రాధా గోవింద్ విహార్ సమీపంలో బైక్పై వచ్చిన నలుగురు వ్యక్తులు వారిని అడ్డగించి ఇనుప రాడ్లతో దాడి చేశారని వివరించారు. ఈ ఘటనను ఆపడానికి ప్రయత్నించిన స్థానిక మహిళ సీమా గుప్తాపై కూడా దుండగులు కాల్పులు జరిపి బంగారు ఆభరణాలతో పరారయ్యారని, ముగ్గురు క్షతగాత్రులను ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.