గృహ బాధ్యతలు మహిళలకే పరిమితం కాదన్న మద్రాస్ హైకోర్టు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తమిళనాడు
గృహ నిర్వహణ బాధ్యతలు కేవలం మహిళలకే పరిమితం కాదని, మహిళలు గృహిణులుగా ఉంటే పురుషులు కూడా ఆ పాత్రను పోషించవచ్చని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ స్పష్టం చేసింది. తిరువణ్ణామలైకి చెందిన వైద్య దంపతుల వివాహ రద్దు కేసును విచారిస్తున్న సందర్భంగా న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. కుటుంబ పోషణలో ఇరుపక్షాల బాధ్యతలు సమానమేనని పేర్కొంటూ, పరస్పర అంగీకారంతో రూ. 2.5 కోట్ల సెటిల్మెంట్తో ఈ వివాదానికి హైకోర్టు తెరదించింది.