కర్ణాటకలో మావోయిస్టు పేరుతో పేలుళ్లు సృష్టించిన నిందితుడు అరెస్ట్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: కర్ణాటక

కర్ణాటకలో మావోయిస్టుగా నటిస్తూ బాంబు పేలుళ్లకు పాల్పడిన కనకలబంద వెంకటేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల నుంచి పరారీలో ఉన్న నిందితుడు పావగడ సమీపంలోని కడమలಕುಂಟೆ కొండల్లో తలదాచుకున్నాడు. పక్కా సమాచారంతో 150 మందికి పైగా పోలీసులతో కూడిన ప్రత్యేక బలగాలు భారీ కూంబింగ్ నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి.