జలమండలి మీటర్ రీడర్ల టెండర్లలో కలకలం: జీఓ నెం. 60 మాయంపై తీవ్ర ఆందోళన

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

జలమండలిలో మీటర్ రీడర్ల నియామకానికి జారీ చేసిన టెండర్లు తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీఓ నెం. 60 నిబంధనలను కొత్త టెండర్లలో ప్రస్తావించకపోవడంపై మీటర్ రీడర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాత విధానాన్ని మార్చి కేవలం మూడు రీజియన్లకు మాత్రమే టెండర్లు పరిమితం చేయడం వల్ల తమ ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారుతోందని క్షేత్రస్థాయి సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.