గణేష్ నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన జన్నారం పోలీసులు భద్రతపై సమీక్ష
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్, కలమడుగు, బాదంపల్లి గ్రామాల్లో వినాయక నిమజ్జన ప్రాంతాలను లక్సెట్టిపేట సీఐ రమణ మూర్తి, జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ పరిశీలించారు. నిమజ్జన వేడుకల్లో భాగంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై వారు ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. నిమజ్జన నిర్వహకులు, ప్రజలు పోలీసుల సూచనలు తూచా తప్పకుండా పాటించాలని వారు కోరారు.