పండుగ వేళ తీవ్ర విషాదం: గుండెపోటుతో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

రిపోర్టర్: సురేష్ స్థలం: ఖమ్మం

ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలో దసరా పండుగ వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న కిన్నెర రాఘవ అనే పద్దెనిమిదేళ్ల యువకుడు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందాడు. సెలవుల కోసం స్వగ్రామానికి వచ్చిన రాఘవ, కుటుంబ సభ్యులతో గడుపుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు వెల్లడించారు. చిన్న వయసులో కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.