యాదాద్రి జిల్లా రాజాపేటలో కోతుల బారి నుండి కూరగాయలను కాపాడుతున్న ప్రభుత్వ ఉద్యోగి

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

యాదాద్రి జిల్లా రాజాపేట మండలంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న కొండ చక్రధారి తన పెరటి స్థలంలో ఎలాంటి రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతిలో సొరకాయ టమాట బెండ కాకర పచ్చిమిరప దొండ తదితర కూరగాయలను సాగు చేస్తున్నారు. కోతుల బారి నుండి పంటను కాపాడుకునేందుకు చెట్ల చుట్టూ ఎర్రని బట్టలను ఏర్పాటు చేసి వినూత్న రీతిలో ఆలోచించి ఇతరులకు ఆదర్శంగా నిలిచి ప్రజల ప్రశంసలు అందుకున్నారు.