వైరాలో దారుణం: బ్యాంకులో మహిళా ఉద్యోగిపై సహఉద్యోగి కత్తితో దాడి
రిపోర్టర్: గోపి
స్థలం: వైరా
ఖమ్మం జిల్లా వైరాలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పనిచేస్తున్న ఫీల్డ్ ఆఫీసర్ తేజశ్రీపై అదే బ్యాంకులో పనిచేస్తున్న పిల్లి ప్రదీప్ కత్తితో దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనలో తేజశ్రీ గొంతుపై దాడికి ప్రయత్నించగా, ఆమె అడ్డుకోవడంతో చేతివేళ్లకు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.