డీఆర్డీవోలో ఇంజనీరింగ్ విద్యార్థులకు పెయిడ్ ఇంటర్న్షిప్ అవకాశాలు
రిపోర్టర్: రాము
స్థలం: తెలంగాణ
డీఆర్డీవో పరిధిలోని క్యాస్డిక్ సంస్థ ఇంజనీరింగ్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం పెయిడ్ ఇంటర్న్షిప్ ప్రకటనను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ముప్పై ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ విభాగాల్లో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి నెలకు ఐదు వేల రూపాయల స్టైపెండ్ అందిస్తామని, అక్టోబర్ పదకొండు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందని వెల్లడించారు.