ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి
రిపోర్టర్: విజయ్
స్థలం: మహబూబ్ నగర్
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్ హరిప్రియ పరిశీలించారు. పెద్దాయపల్లి, కేతిరెడ్డిపల్లి గ్రామాల్లో బీఎల్వోల పనితీరును అడిగి తెలుసుకున్నారు. సర్ ప్రక్రియలో తప్పులను వేగంగా సరిచేయాలని, దరఖాస్తులు మరియు అభ్యంతరాల నమోదులో నిర్లక్ష్యం వహించకుండా ప్రక్రియను విజయవంతం చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు.