జూపాక చెరువులో మొసలి కలకలం భయాందోళనలో గ్రామస్తులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హుజూరాబాద్

హుజూరాబాద్ మండల పరిధిలోని జూపాక గ్రామంలో మైసమ్మ చెరువులో మొసలి ప్రత్యక్షం కావడంతో స్థానికులు, రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని గ్రామస్తులు తెలిపారు. శుక్రవారం పశువులను మేపేందుకు వెళ్లిన కాపరులకు తామర తుప్పల మధ్య భారీ మొసలి కనిపించింది. గత రెండు రోజులుగా చెరువులో మొసలి సంచరిస్తోందన్న ప్రచారం జరుగుతుండగా, తాజాగా అది కనిపిచడంతో ఆందోళన మరింత పెరిగింది. ఏదైనా ప్రమాదం జరగకముందే అటవీశాఖ అధికారులు స్పందించి మొసలిని బంధించి సురక్షిత ప్రాంతానికి తరలించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.