శంషాబాద్ ఎయిర్పోర్టులో సాంకేతిక లోపంతో విమానం అత్యవసర ల్యాండింగ్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: శంషాబాద్
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానం సాంకేతిక లోపంతో అత్యవసరంగా ల్యాండ్ కావడం ప్రయాణికులను కలవరానికి గురిచేసింది. విజయవాడకు బయలుదేరిన 591 ఎయిర్లైన్స్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సమస్యను గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తమై ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో విమానాన్ని సురక్షితంగా వెనక్కి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.