భూముల రీసర్వే ప్రక్రియకు రైతులు సహకరించాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి విజ్ఞప్తి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హన్మకొండ

రాష్ట్రంలో చేపట్టిన భూముల రీసర్వే ప్రక్రియకు రైతులు పూర్తిగా సహకరించాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కోరారు. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ గ్రామంలో భూ రీసర్వే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సర్వేతో భూ సంబంధిత సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. రైతులు తమ భూముల వివరాలను ఎలాంటి దాగుడుమూతలు లేకుండా పారదర్శకంగా అధికారులకు అందించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.