బీఎస్ఎన్ఎల్ సర్కిళ్ల త్రైమాసిక సమీక్ష: కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి భేటీ

రిపోర్టర్: సతీష్ స్థలం: గుంటూరు

బీఎస్ఎన్ఎల్ సర్కిళ్ల త్రైమాసిక పనితీరుపై కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్లు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ - కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ వెల్లడించారు. ఈ సమావేశంలో వివిధ సర్కిళ్ల ఆర్థిక, నిర్వహణ సామర్థ్యాలను కూలంకషంగా పరిశీలించినట్లు ఆయన తెలిపారు. ఏపీ, పంజాబ్, కేరళ, మహారాష్ట్ర సర్కిళ్లు మెరుగైన పనితీరు కనబరిచాయని ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి స్పష్టం చేశారు.