రూ.5లకే ఆటో ప్రయాణం.. తిరుచానూరు యువకుడి ఉదారత!

రిపోర్టర్: సతీష్ స్థలం: తిరుపతి జిల్లా

తిరుపతి జిల్లా తిరుచానూరుకు చెందిన ఆటో డ్రైవర్ అజిత్ మహిళల కోసం అరుదైన సేవనందిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే మహిళల నుంచి తిరుచానూరు నుంచి తిరుపతి బస్టాండ్, రైల్వేస్టేషన్ వరకు కేవలం రూ.5 మాత్రమే ఛార్జీగా వసూలు చేస్తున్నారు. ఇతరులు రూ.30 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నప్పటికీ, నలుగురికి సాయం చేయాలనే ఉద్దేశంతో నాలుగు నెలలుగా ఈ నిబద్ధతను కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.