అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మోడల్ ప్రెస్లీ గెర్బర్ మృతి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: California

అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రముఖ మోడల్ ప్రెస్లీ గెర్బర్ సెప్టెంబర్ 20న అనూహ్య రీతిలో మృతి చెందారని విదేశీ మీడియా వెల్లడించింది. మరణానికి ముందు ఆయన తన చివరి క్షణాలను రికార్డు చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. శాంతామోనికాలోని రిజల్యూషన్స్ లివింగ్ పునరావాస కేంద్రంలో బస చేసిన సమయంలో ప్రెస్లీ గెర్బర్ తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని సెల్ఫీ కెమెరాలో బంధించారు. ఈ ఘటనతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.