యాదాద్రి శివాలయంలో వైభవంగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: యాదగిరిగుట్ట
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొండపై కొలువుదీరిన పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర స్వామివారికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేదమంత్రాల నడుమ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం వైభవంగా సాగింది. ప్రభాతవేళలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకించి మొక్కులు తీర్చుకున్నారు.