గ్రోక్ ఏఐ నిర్వహణ ఖర్చులు భరించలేకపోతున్నామన్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

గ్రోక్ ఏఐ చాట్ బాట్ నిర్వహణ ఖర్చులు రాబడికి మించి విపరీతంగా పెరిగిపోయాయని, వాటిని భరించడం ఎంతో కష్టంగా మారిందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. ఎక్స్ వేదికగా ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, సర్వర్ ఖర్చులు పెరగకుండా నిరోధించడానికి కంపెనీ కఠిన వినియోగ పరిమితులను అమలు చేస్తోందని వెల్లడించారు. వచ్చే ఆదాయంతో పోలిస్తే ఖర్చులే ఎక్కువ అవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.