మహిళల ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ విడుదల: జనవరి 14 నుంచి టోర్నీ ప్రారంభం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Mumbai
మహిళల ప్రీమియర్ లీగ్ 2027 షెడ్యూల్ ను బీసీసీఐ అధికారికంగా విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. మొత్తం ఇరవై రెండు మ్యాచ్ లను వడోదర, ముంబై నగరాలలో నిర్వహించనున్నారు. జనవరి 14న జరిగే తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయని నిర్వాహకులు తెలిపారు.