రైతన్నల భాగస్వామ్యంతో ముమ్మరంగా సాగుతున్న డిజిటల్ క్రాప్ సర్వే
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్లు
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల పరిధిలోని ఆకుతోటపల్లి గ్రామంలో డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియను మండల వ్యవసాయ అధికారి పి. శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ పంట నమోదు కార్యక్రమంలో రైతులు అందరూ పూర్తి సహకారం అందించాలని కోరారు. డిజిటల్ క్రాప్ సర్వే పూర్తి చేయడానికి సెప్టెంబర్ 30, 2026 చివరి తేదీగా నిర్ణయించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిజిటల్ క్రాప్ సర్వే సూపర్వైజర్ స్రవంతి తదితరులు పాల్గొన్నారు.