దిల్లీలో బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో భారీ భద్రత

రిపోర్టర్: నరేష్ స్థలం: New Delhi

దిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ఎలాంటి అంతరాయం కలగకుండా కేంద్ర భద్రతా, నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో వీవీఐపీ మార్గాలు, హోటళ్లు, కీలక ప్రాంతాల్లో నిఘా పెంచారు. డ్రోన్ల ముప్పు, నిరసనలు, గ్రాఫిటీల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.