ది ప్యారడైజ్ మూవీలో గద్దర్ ఐకానిక్ సాంగ్ అంటూ జోరుగా ప్రచారం
రిపోర్టర్: హరి
స్థలం: తెలంగాణ
నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మాస్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్ చిత్రంలో గద్దర్ అమూల్యమైన గీతం పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా పాటను ఉపయోగిస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఈ ఐకానిక్ ఫోక్ సాంగ్ చోటు చేసుకుంటే థియేటర్లలో ప్రేక్షకుల ఊపు నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని సినీ వర్గాలు అంటున్నాయి. అయితే దీనిపై చిత్రయూనిట్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.