నిరుద్యోగులకు భారీ ఊరట: మైగ్రేషన్ సర్టిఫికెట్ లేకుండానే ఉద్యోగ దరఖాస్తులకు అనుమతి

రిపోర్టర్: శివ స్థలం: అమరావతి

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వలస వచ్చిన నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలకమైన వెసులుబాటు కల్పించినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఉద్యోగ దరఖాస్తుల సమయంలో మైగ్రేషన్ సర్టిఫికెట్ సమర్పించాలనే నిబంధనను సవరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2024 జూన్ 1వ తేదీకి ముందు వలస వచ్చిన అభ్యర్థులు మైగ్రేషన్ పత్రం లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చని, అయితే స్థానికత పత్రాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.