అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ తీవ్ర హెచ్చరిక

రిపోర్టర్: రాజేష్ స్థలం: World

అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాల దూకుడుపై ఇరాన్ సైనిక నాయకత్వం తీవ్రంగా స్పందించింది. ఏ క్షణంలోనైనా దాడులు జరిగితే శక్తివంతమైన ప్రతీకార దాడి తప్పదని హెచ్చరించింది. ఇరాన్ సైన్యం, రివల్యూషనరీ గార్డ్స్ ఐక్యంగా శత్రువులను ఎదుర్కొంటాయని స్పష్టం చేశారు. ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదని, అమెరికా కుట్రలను తిప్పికొడతామని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ తేల్చిచెప్పారు.