ఏపీలో ఫైర్ సర్వీసెస్ డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

రిపోర్టర్: రమేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు ఫైర్ సర్వీసెస్ శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటన జారీ చేసింది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌తో పాటు రాత పరీక్షను కూడా ప్రభుత్వం తప్పనిసరి చేసింది. త్వరలోనే పూర్తి షెడ్యూల్ విడుదల కానుంది.