సీపీ ప్లస్ బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ నియామకం

రిపోర్టర్: సతీష్ స్థలం: కడప

దేశీయ ప్రముఖ సెక్యూరిటీ సాంకేతిక సంస్థ సీపీ ప్లస్ నూతన బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ను నియమించినట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య ఖేమ్కా అధికారికంగా ప్రకటించారు. ఈ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా స్మార్ట్ సెక్యూరిటీ సిస్టమ్స్పై అవగాహన మరింత పెంచనున్నట్లు ఆయన వెల్లడించారు. స్వదేశీ పరిజ్ఞానంతో సురక్షితమైన సమాజాన్ని నిర్మించడమే తమ ప్రధాన లక్ష్యమని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది.