ఆరోగ్యానికి ఫైబర్ ఆహారం ఎంతో మేలని వెల్లడించిన వైద్యులు

రిపోర్టర్: సురేష్ స్థలం: బెంగళూరు

శరీర ఆరోగ్యానికి పీచుపదార్థం ఎంతగానో దోహదపడుతుందని బెంగళూరులోని హెచ్సీజీ క్యాన్సర్ ఆసుపత్రి నిపుణురాలు డాక్టర్ ఎస్తేర్ సతియరాజ్ తెలిపారు. ఫైబర్ ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుందని, బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయని ఆమె పేర్కొన్నారు. రోజువారీ డైట్లో తగినపాళ్లలో ఫైబర్ ఉండేలా చూసుకోవాలని, లేదంటే వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని సూచించారు.