రాజకీయాల్లోకి నా కుమార్తె రాదంటూ మంత్రి నారాయణ తేల్చిచెప్పారు
రిపోర్టర్: హరి
స్థలం: నెల్లూరు
తన కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి ప్రవేశించబోరని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ కుమార్తె మేయర్గా పోటీ చేస్తారనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తనపై వస్తున్న వదంతులు నిరాధారమని, ప్రజలకు సేవ చేయడమే తన ధ్యేయమని ఆయన పునరుద్ఘాటించారు. పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించి మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు.